Raviteja First look Teaser | మాస్ మహరాజ ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా రవితేజను పరిచయం చేస్తూ మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఫస్ట్ టైమ్ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో మాస్‌రాజా ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. టీజర్ మొత్తం యాక్షన్‌తో రవితేజ్ ఈజ్ బ్యాక్ టు ది యాక్షన్ అన్నట్లు సాగింది. చివర్లో ‘ఏంరా వారి ఇంత పిస పిస చేస్తున్నవ్.. నీకింకా సమజ్ కాలే, నేను ఎవ్వని అయ్యకు విననని’ అంటూ రవితేజ ఎనర్జిటిక్ డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్లో రవితేజ ఎనర్జీ వేరే లెవల్లో ఉంది. ‘క్రాక్’ తర్వాత ఆ రేంజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ ఏసీపి విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో రవితేజ, చిరుకు తమ్ముడిగా నటించనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది. చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది.