కొత్త డైరెక్టర్ శరత్ మండవతో టాలీవుడ్ యాక్టర్ రవితేజ 68వ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం సర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ శరత్ మండవ రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. రేపు ఉదయం 10: 08 గంటలకు ఫస్ట్ లుక్ లాంఛ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించాడు. అతడి నడక, మాట, పని పెద్ద స్టేట్మెంట్ ఇస్తాయి..అంటూ రవితేజ సినిమా ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ అప్ డేట్ ను ఇచ్చాడు.
ఈ మూవీలో రవితేజ మెజిస్ట్రేట్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం రమేశ్ వర్మతో చేస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమా పూర్తవగానే శరత్ మండవ తో చేస్తున్న ప్రాజెక్టుపై తన ఫోకస్ పెట్టబోతున్నాడు మాస్ మహారాజా.
యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంగ కౌశిక్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్ తో అసోసియేట్ అవుతూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
His walk, His talk & His act make a loud style statement.
— Sarath (@directorsarat) July 11, 2021
You know what it means with #RT68FirstLook Tomorrow at 10:08 AM 🔥
😊 hv a great Sunday ! @RaviTeja_offl @itsdivyanshak @directorsarat @sathyaDP @sahisuresh @Cinemainmygenes @SamCSmusic @SLVCinemasOffl #RTTeamWorks pic.twitter.com/jKiPocDMFR
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Recommended Content by ntnews.com