Raviteja | ప్రస్తుతం మాస్‌రాజా రవితేజ ఉన్నంత హ్యపీగా ఎవరు లేరెమో. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ కంబ్యాక్ తర్వాత ‘ఖిలాడీ’ రవన్న కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో ఓపెనింగ్స్ బాగానే రాబట్టుకుంది. కానీ రెండో రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడిపోయాయి. ఇక వారం తిరిగే లోపే థియేటర్ల నుండి మాయమైపోయింది. సరే ఒక భారీ విజయం తర్వాత ఫ్లాప్ సహజమే అనుకుంటే.. ఎంతో కష్టపడి చేసిన ‘రామారావు’ కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రవన్నను తీవ్రంగా నిరాశపరిచాయి.
ఈ క్రమంలో తన రెగ్యులర్ జానర్ అయిన మాస్ చొక్కా తొడుక్కుని ధమాకాతో గతేడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రిలీజ్ రోజునే ఫుల్ నెగెటీవ్ రివ్యూలు.. కట్ చేస్తే రవితేజ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ధమాకా సక్సెస్ ఎంజాయ్ చేసేలోపే వాల్తేరు వీరయ్య మరో హిట్టు. అప్పుడు రెండు డిజాస్టర్లతో నిరాశపడిన రవితేజకు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు రవన్న ఉత్సాహాన్ని రెండింతలు చేసింది. ప్రస్తుతం అదే జోష్‌తో సెట్స్ మీద ఉన్న సినిమాలు చేస్తున్నాడు.
అయితే తాజాగా మాస్‌రాజా క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు వినిపిస్తుంది. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి విభిన్న సినిమాలో టాలీవుడ్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన తేజ సజ్జాతో పాన్ ఇండియా సినిమా హనుమాన్ రూపొందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్‌ను వెల్లడించనుంది. కాగా తాజాగా ప్రశాంత్ వర్మ, రవితేజకు ఓ లైన్ చెప్పి తన లైన్లోకి తీసుకున్నాడట. రవితేజకు ఆ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని రమ్మన్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం అ! కు రవితేజ గొంతును దానం చేసాడు.
అయితే మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజను క్లాస్ సినిమాలు తీసే ప్రశాంత్ వర్మ ఎలా హండిల్ చేస్తాడు అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇక మాస్‌రాజా కూడా ఈ మధ్య ప్రయోగాత్మక సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ లెక్కన వీరి మధ్య సింక్ బాగానే కుదిరినట్లుంది. చూడాలి మరి చివరికి ఈ కాంబినేషన్ సెట్టవుతుందా? ఫట్టవుతుందా ? అని.