Ravi Teja | కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఏ హీరో సినిమాల నుంచి కూడా రావడంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్రాజ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. తాజాగా ఈయన సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
రవితేజ ప్రస్తుతం ‘నేనులోకల్’ ఫేం ‘త్రినాథ్ రావు నక్కిన’ దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్నాడట. అందులో ఒక పాత్ర నెగిటీవ్ షేడ్స్‌లో ఉండనుందట. ఇంటర్వెల్‌కు ముందు ఈ పాత్ర రివీల్ అవుతుందని టాక్. ఇక మరో పాత్ర ‘కిక్’ సినిమాలో రవితేజలాగా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటనుందట. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శ్రీలీలా హీరోయిన్గా నటిస్తుంది. ఇదివరకే విడుదలైన శ్రీలీలా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.