Ravi Teja Next Film | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఈయన ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈయన లేటెస్ట్గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రవితేజ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. ఈ మూడు ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. కాగా తాజాగా రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టెటర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా శ్రీవాస్, రవితేజకు ఓ మాస్ యాక్షన్ కథను నరేట్ చేశాడట. కథ నచ్చడంతో మాస్‌రాజా కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. శ్రీవాస్ ప్రస్తుతం గోపించంద్‌తో సినిమా చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం తర్వాత ఈ కాంబోలో మూవీ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
రవితేజ ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీలా హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటుగా ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక చిరు-బాబి కాంబోలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే రవితేజ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు.