Ravi Teja | మాస్ మహరాజా రవితేజకి ఈ మధ్య హిట్స్ పడడం లేదు. ఆయన మంచి సక్సెస్ అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉండగా, ఆ సినిమాలని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇదే సమయంలో అభిమానులకి జోష్ అందించడానికి రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రం వెంకీని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 2004లో వచ్చిన ఈ మూవీని జూన్ 14న రీరిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ పేర్కొన్నారు. 4కేలో ఈ మూవీ విడుదల కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్నేహ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైన ర్ లో అశుతోష్ రాణా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు
వెంకీ చిత్రాన్ని 2023 డిసెంబర్లో రీరిలీజ్ చేశారు. ఆ సమయంలో మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటైన ‘వెంకీ’ సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో పట్టుబడుతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఆ సినిమాలోని కామెడీ సన్నివేశాలు నేటికీ మీమ్స్ ద్వారా ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆడియెన్స్ కోరిక మేరకు వెంకీ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన వెంకీ సినిమా అప్పట్లో కమర్షియల్గా మంచి హిట్ ను నమోదు చేసింది. కామెడీ కింగ్స్ రవితేజ, బ్రహ్మానందంల కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. ట్రైన్ ఎపిసోడ్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది. ఈరోజు థియేటర్లలో కూడా ఇదే రిపీట్ అయింది. బ్రహ్మానందం ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ కంఠస్థం చేశారు అభిమానులు. అది మాత్రమే కాదు.. ట్రైన్ ఎపిసోడ్లో వేణుమాధవ్ పాడే పాటలు, రవితేజ ఎనర్జీ అంతా థియేటర్లలో మార్మోగిపోవడం ఖాయం.