రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమా విడుదల కాకముందే ఇదే సంస్థ రవితేజతో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యిందని విశ్వసనీయ సమాచారం.
‘మ్యాడ్’ ఫ్రాంచైజీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇటీవలే ఈ కథను రవితేజ, నాగవంశీలకు దర్శకుడు కల్యాణ్ శంకర్ వినిపించారని, ఫాంటసీ కామెడీ నేపథ్యంలో తయారైన ఈ కథ విని రవితేజ, నాగవంశీ ఫుల్గా ఇంప్రస్ అయ్యారని ఫిల్మ్ వర్గాల భోగట్టా. ‘మాస్ జాతర’ తర్వాత కిశోర్ తిరుమల సినిమా చేస్తారు రవితేజ. ఆ సినిమా అవ్వగానే కల్యాణ్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తున్నది.