రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల 6న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఊహించని మలుపులతో ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మూవీ టీమ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో.