Mr Bachchan | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ కొత్త షెడ్యూల్ లక్నోలో షురూ అయిందని ఇప్పటికే అప్డేట్ తెరపైకి వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త స్టిల్ రూపంలో చక్కర్లు కొడుతోంది. రవితేజ అండ్ టీంపై వచ్చే ఎడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు.
సెట్స్‌లో నుంచి మానిటర్లో కనిపిస్తున్న ఓ షాట్ స్టిల్‌ను షేర్ చేశాడు హరీష్ శంకర్. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసుకున్న టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కాగా.. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో కథానుగుణంగా రవితేజ అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. తాజా షెడ్యూల్ షూట్‌తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది.