‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అగ్ర నటుడు రవితేజ.. పనిలోపనిగా తన తర్వాత సినిమా కోసం కథల్ని వింటున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విని, ఓకే చేశారనే వార్త ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. నిజానికి బాలకృష్ణతో వివేక్ ఆత్రేయ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు.
కానీ మధ్యలో అనుకోకుండా కొరటాల శివ ఎంట్రీ ఇవ్వడం, ఆయన కథను బాలయ్య ఓకే చేయడంతో వివేక్ సినిమా ప్రశ్నార్థకంగా మారింది. దాంతో ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న మరో కథను రవితేజకు చెప్పి, వివేక్ ఆత్రేయ ఓకే చేయించుకున్నారట. వివేక్ ఆత్రేయ తదుపరి సినిమా రవితేజతోనే.. ఇందులో మరో మాటకు తావులేదు.. అంటూ ఫిల్మ్వర్గాలు బలంగా చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ సినిమాను ఎవరు నిర్మించేది తెలియదు.