వరుసపెట్టి సినిమాలు చేస్తూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు హీరో రవితేజ. పోయిన దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసిన రవితేజ, సంక్రాంతి ‘ఈగల్’లో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఈగల్’ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌లా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ ‘ ఇందులో కొత్త రవితేజను చూస్తారు. ఆయన పాత్రలో రకరకాల కోణాలుంటాయి. కథానుగుణంగా విభిన్నమైన గెటప్పుల్లో ఆయన కనిపిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: డేవ్ జాన్, నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్.