బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 75 రోజులు పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజులలో షోకి ముగింపు కార్డ్ పడనుంది. ఇప్పుడు హౌజ్‌లో 9మంది ఇంటి సభ్యులు ఉండగా, ఎవరి ప్లాన్స్‌తో వారు గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రింగ్ ఈజ్ కింగ్ అనే టాస్క్ ఇవ్వగా, ఇందులో మానస్ కెప్టెన్‌గా గెలిచాడు. దీంతో సన్నీ, కాజల్ ఫుల్ ఖుష్ అయ్యారు.
కెప్టెన్ అయిన తరువాత మానస్.. సన్నీ, కాజల్ దగ్గరకు వచ్చాడు. ఏ డిపార్ట్మెంట్ కావాలి, ఏ పని చేస్తావ్ అని కాజల్‌ను మానస్ అడుగుతాడు. ఏది ఇస్తే అది చేస్తాను అని కాజల్ అంటుంది. ఫస్ట్ సారీ చెప్పు అంటూ బ్రతిమలాడించుకొని మరీ సారీ చెప్పించుకుంటుంది. మానస్ సారీ చెప్పడంతో ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత సన్నీ కూడా వారితో జాయిన్ అయ్యాడు.
మానస్ కెప్టెన్ కావడంతో తెగ సంబర పడ్డ సన్నీ ఏకంగా మానస్‌కు ముద్దులు పెట్టేశాడు. మానస్ కూడా తిరిగి ముద్దులు పెట్టాడు. ఏరా పెదవుల మీద ముద్దు పెడతావా? నేను ఇంకా వర్జిన్రా ఇంత వరకు ఎవ్వరికీ పెట్టలేదు అని సన్నీ అనడంతో.. కాజల్ షాకై చూసింది. ఇది నిజం నమ్ము అని సన్నీ అంటాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు రవి.