బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండెర్ టాస్క్ ఆసక్తికరంగా నడుస్తుంది. తొలి రౌండ్ లో మానస్, ప్రియాంక మధ్య ఫైట్ జరగగా, ఆ పోటీలో ప్రియాంక గెలిచింది. అయితే అంతకముందు మానస్..తనకు లభించిన పవర్ సన్నీకి ఇవ్వగా, అందులో ఒక ఇంటి సభ్యుడి దగ్గర నుంచి ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని ఉంది. దీంతో సిరి దగ్గర ముత్యాలను తీసుకొని షణ్ముఖ్‌కి ఇస్తాడు. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.
అడ్డదారిలో టాస్క్ గెలవడం సిరికి కామన్‌గా మారింది. తాజా టాస్క్‌లోనూ అదే సీన్. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే.. సిరి రవి కాయిన్స్‌ని నొక్కేసింది. అది చూసిన షణ్ముఖ్.. వరస్ట్ రా నువ్.. అన్నీ దొబ్బుడే నీకంటే నేనే బెటర్.. వాళ్లు నీపై పడిపోతారు.. నేను కాపాడాలి అని షణ్ముఖ్ అంటే.. గేమ్ రా అని నవ్వుకుంది సిరి. ఇక శ్రీరామ్ చంద్రకు ఓ పవర్ రాగా, అది అతనికి అనుకూలంగా రాలేదు.
30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం.ఇక రవి.. సిరి దగ్గరకు వెళ్లి నువ్ ఎందుకంత రియాక్ట్ అయ్యావ్ అని సిరిని అడిగాడు రవి. సిరి నవ్వుతూ ఇద్దరికీ బాగా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది. వాడి తప్పే కాదు నాది కూడా ఉంది. అని అన్నది.
మరి షణ్ముఖ్ నాదే తప్పు అంటున్నాడు ఏంటి? అని రవి అంటే.. సిరి తెగ మురిసిపోయింది. దీంతో రవి.. మీరిద్దరూ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది మీ ఇద్దర్నీ చూస్తే.. ఒకరికోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా సిద్ధమైనట్టు అనిపిస్తుంది. వాడు బాగా ట్రిప్ అవుతున్నాడు, నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో అది ఆలోచించూ అంటూ రవి నీతి వ్యాఖ్యాలు చెప్పాడు.