రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మాతలు. ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఓ పల్లెటూరి ప్రేమకథ ఇదని, వాస్తవానికి దగ్గరగా వుండే కథ, కథనాలతో దర్శకుడు ఈ సినిమాను మలిచాడని నిర్మాతలు చెప్పారు.
రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంతోపాటు రచన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందించిన ఈ సినిమాకు సంగీతం: జశ్వంత్ పసుపులేటి, నిర్మాణం: షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్.