బిగ్‌బాస్ షో.. ఇక్కడ ఎప్పడు, ఏమైనా జరగొచ్చు. ఇందులో ఊహించనిది జరగడమే స్పెషాలిటి. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న రవిని ఎలిమినేట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రవి టాప్ 3లో ఉంటారని అందరు ఊహంచారు. కాని అతడిని మూడు వారాల ముందే పంపించేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు.
యాంకర్ రవికి అన్యాయం జరిగిందని సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఇందులో ఏదో మోసం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రేక్షకులను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. స్ట్రాటజీ ప్రకారమే రవిని హౌస్ నుంచి బయటకు పంపారని.. రవి కంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్లను హౌజ్‌లో ఉంచి ఒకరికి లబ్ధి చేకూరేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రవర్తించడం చాలా తప్పు అంటూ నవీన్ గౌడ్ మండిపడ్డారు. మరో వైపు రవి అభిమానులు కూడా నిరసనలకు దిగుతున్నారు.