సీనియర్ కథానాయిక రవీనా టండన్ తనయ రషా తడాని తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నది. అగ్ర హీరో మహేష్‌బాబు సోదరుడు, దివంగత రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో రషా తడాని నాయికగా ఎంపికైంది. అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
న్యూఏజ్ లవ్‌స్టోరీగా రూపొందించబోతున్నారు. హిందీలో ‘అజాద్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రషా తడాని ఆ చిత్రంలోని ‘ఉయ్ అమ్మా..’ అనే పాటతో పాపులర్ అయింది. ఆమె తెలుగు చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: చందమామ కథలు, నిర్మాత: పి.కిరణ్, రచన-దర్శకత్వం: అజయ్‌భూపతి.