టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) తన 70వ (Ravi Teja 70) చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. సుధీర్ శర్మ (Sudheer Varma) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ప్రకటించినట్టుగానే రవితేజ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రానికి రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారు. అంతేకాదు టైటిల్‌కు తగ్గట్టుగా పది తలల రావణాసురుడిని గుర్తుకు తెచ్చేలా ఉన్న మాస్ మహారాజా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
రవితేజ షూటు బూటులో ఓ వైపు స్టైలిష్‌గా కనిపిస్తూనే..మరోవైపు తనలోని డిఫరెంట్ షేడ్స్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నాడని పోస్టర్ ద్వారా తెలియజేశాడు సుధీర్ శర్మ. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీని పెంచేసిన సుధీర్ వర్మ మరి రవితేజను సిల్వర్ స్క్రీన్‌పై డెమన్ కింగ్ రావణాసురగా ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
𝑯𝒆𝒓𝒐𝒆𝒔 Don’t Exist 👤
— BA Raju's Team (@baraju_SuperHit) November 5, 2021
But 𝑫𝒆𝒎𝒐𝒏𝒔 Does 👺
Presenting 𝑴𝒂𝒔𝒔 𝑴𝒂𝒉𝒂𝑹𝒂𝒋𝒂 @RaviTeja_offl as
Dashamukha🗿 #𝗥𝗔𝗩𝗔𝗡𝗔𝗦𝗨𝗥𝗔 🔥
The BAAP of ALL DEMONS 💥@sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks @SrikanthVissa pic.twitter.com/zFiqOrx4ZW
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్‌నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హీరోలు ఉండరు’ (Heroes does not exist) అనే క్యాప్షన్‌తో సుధీర్ వర్మ ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్తోపాటు తాజాగా బయటకు వచ్చిన స్టిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి