రావణ్ నిట్టూరు, శ్రీ నికిత జంటగా నటిస్తున్న సినిమా ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఈ చిత్రాన్ని కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్నారు. ఆనంద్ జె దర్శకుడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటున్నది.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ను దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. ఫస్ట్ లుక్ బాగుందన్న ఆమె చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : సత్య గిడుతూరి, సంగీతం : ఫణి కళ్యాణ్.