‘రాకా’లో రష్మిక?
పుష్ప’ ఫ్రాంఛైజీలో పుష్పరాజ్, శ్రీవల్లి జోడీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు మరోమారు వెండితెరపై సందడిచేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
‘పుష్ప’ ఫ్రాంఛైజీలో పుష్పరాజ్, శ్రీవల్లి జోడీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు మరోమారు వెండితెరపై సందడిచేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ‘రాకా’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో మరో నాయికకు చోటుందని, కథాగమనంలో ఆమెది అత్యంత కీలకమైన పాత్ర అని చెబుతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం రష్మిక మందన్నను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది. మానవాతీత శక్తులు కలిగిన యువతిగా ఆమె పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రష్మికతో పాటు మృణా ల్ ఠాకూర్, జాన్వీకపూర్ కూడా కీలక పాత్రల్ని పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

