Rashmika- Vijay | గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ-రష్మికల రిలేషన్ షిప్ గురించి ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాని దానికి వారు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఓ రకంగా దోబూచులాడుతున్నారు. ఫెస్టివల్స్ ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వెకేషన్స్‌కి కలిసే వెళుతున్నారు. ఇద్దరిలో ఎవరి బర్త్ డే అయిన కూడా ఏదో వెకేషన్‌కి వెళ్లి అక్కడే కలిసి చేసుకుంటున్నారు. అయితే ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కాగా, ఆమె తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం… ఒమన్ వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగానే… చాలా మంది ‘విజయ్ దేవరకొండ ఎక్కడ?’ అంటూ కామెంట్ చేశారు.అయితే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరు కలిసే ఉన్నారనే చర్చ మొదలైంది.
విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఇద్దరు విడివిడిగా ఒమన్ వెళ్లినట్టు తెలుస్తుంది. రష్మిక కంటే ఒక్క రోజు ముందు ముంబై నుంచి విజయ్ దేవరకొండ ఒమన్‌కి బయలుదేరాడు. ఆ తర్వాత రోజు నేషనల్ క్రష్ రష్మిక వెళ్ళింది. ఇద్దరు ఒకే చోటకు వెళ్లారనే సంగతి ఆడియన్స్ అందరికీ అర్ధమవుతుంది. మొదట రష్మిక మందన్నా పంచుకున్న ఫొటోలలో ఆమె సముద్రపు ఒడ్డున బోట్లో విందు ఆరగిస్తుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సముద్ర తీరంలో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను, నడుస్తున్న ఫోటోలను విడుదల చేశారు. అవి చూసాక ఇద్దరు ఒకే చోట ఉన్నారని నెటిజన్స్ భావిస్తున్నారు.
తమ ప్రేమ గురించి విజయ్ దేవరకొండ ఇలా క్లూ ఇచ్చాడని, వీలైనంత తొందరలోనే వారి రిలేషన్ షిప్కి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వస్తుందని నెటిజన్స్ అంటున్నారు. సినిమాల విషయానికి వస్తే… విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ మళ్ళీరావా సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్డమ్ చిత్రం రూపొందుతుంది. కొద్ది రోజుల క్రితం సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా, ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సారి విజయ్ దేవరకొండ ఎలాగైన పాన్ ఇండియా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక చివరిగా సికందర్ చిత్రంతో పలకరించిన రష్మిక ఇప్పుడు నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నారు.