The Girlfriend Movie | యానిమల్, పుష్ప 2 ది రూల్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. అయితే ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది ఈ భామ. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend Movie). ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
నయనం నయనం కలిసే తరుణం.. ఎదనం పరుగై పెరిగే వేగం. నా కదిలే మనసుని అడిగా సాయం. ఇక మీదట నువ్వే దానికి గమ్యం అంటూ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. స్టోరీ ఏం రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటించబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.