Baby | సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్ అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక రూమర్ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. అయితే పుకార్ల మాట అటుంచితే రష్మిక, విజయ్ మంచి ఫ్రెండ్స్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ సోయగం తన కోస్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) సినిమాకు సపోర్ట్‌గా నిలిచింది.
ఈ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం బేబి (Baby). హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్ అప్డేట్ అందించారు. రేపు సాయంత్రం 5 గంటలకు రష్మిక ఈ పాటను లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ.. అప్డేట్ అందించారు మేకర్స్.
బేబి మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బేబి నుంచి ఇప్పటికే ఓ రెండు మేఘాలియా, దేవరాజా పాటలకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలిలా, దేవరాజా యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. .
ఇప్పటికే విడుదలైన బేబి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ గతేడాది మిస్టరీ క్రైం థ్రిల్లర్ హైవే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం మరోవైపు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు.
#BabyTheMovie 3rd Single #Premisthunna sets off a SENSATIONAL vibe with a Grand Launch Event tomorrow @ 5PM 💥
Song unveil by
National Crush @iamRashmika 🥳❤️📍R K Cineplex,HYD.@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 @sairazesh @VijaiBulganin @SKNonline pic.twitter.com/4GM2bGBNhm
— BA Raju’s Team (@baraju_SuperHit) May 15, 2023
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో