విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లాడబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమపై వస్తున్న వార్తలను వీరిద్దరూ ఖండించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరేలా చేసింది. దీంతో టాలీవుడ్ లవ్‌బర్డ్స్ అంటూ వీరిద్దరినీ ముద్దుగా పిలిచేసుకుంటున్నారు నెటిజన్స్. ఇదిలావుంటే.. ఈసారి ఏకంగా వీర్దిదరికీ ఎంగేజ్మెంట్ అయిందంటూ కథనాలొచ్చేశాయి.
ఇటీవల ఓ వేడుకకు హాజరైన రష్మిక చేతికి ఓ కొత్త ఉంగరం కనిపించడంతో ఈ కొత్త రూమర్ మొదలైంది. దీంతో తన చేతికున్న ఉంగరంపై రష్మిక క్లారిటీ ఇచ్చారు. ‘నిశ్చితార్థమైనా పళ్లైనా అందరికీ చెప్పే చేసుకుంటా. రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఉంగరం నా సెంటిమెంట్. ఇది ధరిస్తే తెలీని మనశ్శాంతి. అంతేతప్ప ఇదేం నిశ్చితార్థపు ఉంగరం కాదు.’ అంటూ వివరణ ఇచ్చారు రష్మిక.