Rashmika | పానిండియా స్థాయిలో సూపర్స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నది కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ అన్నీ భాషలనూ కవర్ చేసేస్తున్నది రష్మిక. ఆమె సినిమాల జాబితాను పరిశీలిస్తే.. వాటిలో ఆసక్తికరమైన సినిమా ఒకటుంది. ఆ సినిమానే ‘థామా’. రష్మిక నటిస్తున్న తొలి హారర్ కామెడీ సినిమా ఇది. ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకుడు. దినేష్ విజన్ హారర్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఆమె పాత్ర ఏ రీతిలో ఉంటుంది? ఆహార్యం ఎలా ఉంటుంది? అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. రష్మిక రిస్క్ తీసుకుంటుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తాజా ఇంటర్వ్యూలో ‘థామా’లోని తన పాత్ర గురించి మాట్లాడింది రష్మిక. ‘రీసెంట్గా నైట్ షూట్ సన్నివేశాల్లో నటించాను. నా కెరీర్లో ఈ తరహా సినిమా చేయడం ప్రథమం. ఇందులో దెయ్యాన్ని నేనేనంటూ చాలామంది విడుదలకు ముందే భయపడుతున్నారు. కథనాలు కూడా వచ్చేస్తున్నాయ్. ఇందులో నేను భయపడేదాన్నే కానీ, భయపెట్టేదాన్ని కాదు.’ అంటూ అందంగా నవ్వేసింది రష్మిక.