D51 Movie | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోరు చూపిస్తుంది రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో తెగ బిజీగా మారిపోయింది. ఇక తాజాగా ఈ అమ్మడు తెలుగులో మరో క్రేజీ సినిమాలో భాగం అయింది.
సార్‌తో తెలుగులో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో మరో తెలుగు స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. ఓ వైపు ఆకాశన్నంటే భవనాలు, మరోవైపు మురికి వాడలు.. వాటి మధ్య నోట్ల కట్టలతో ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్బుతో ముడిపెట్టిన కథ ఇదని స్పష్టం అయింది. కాగా తాజాగా ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నట్లు వస్తున్న వార్తలు సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. ఇక ఇప్పుడు రష్మిక కూడా ఈ సినిమాలో భాగం అవడంతో సినిమాపై మాములు హైప్ రాలేదు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రేపో మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక రేయిన్బో అనే ద్విభాషా సినిమా చేస్తుంది. శాంత రూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనితో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే తనకు సంబంధించిన టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇవే కాకుండా మోస్ట్ అవేయిటెడ్ మూవీ పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
Beginning of a new journey.💃🏻❤️#D51
A @sekharkammula film 🎥@dhanushkraja @AsianSuniel @puskurrammohan #AmigosCreations @SVCLLP pic.twitter.com/dQFghtqd6R
— Rashmika Mandanna (@iamRashmika) August 14, 2023