Rashmika Mandanna | ఓ వైపు సౌత్ సినిమాలు.. మరో వైపు నార్త్ సినిమాలు.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రలతో మెరిసిన రష్మిక.. ఈ మధ్య వరుసగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రేయిన్బో అంటూ మహిళా కాన్పెప్ట్ సినిమాను ప్రకటించిన రష్మిక.. తాజాగా మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను ప్రకటించింది.
చిలసౌ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను కూడా వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయానుకునే లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఇదొక ట్రాజిక్ లవ్ స్టోరీ అని, ఈ కుర్రాడు సైకో లాంటి మనిషని అర్థమవుతుంది.
దీనిపై క్లారిటీ రావాలంటే టీజర్ లాంటిది వస్తే ఏమైనా తెలుస్తుంది. కెరీర్ మంచి ఊపుమీదున్న టైమ్‌లో ఇలాంటి సినిమా చేయడం నిజంగా రష్మిక గట్స్‌కు మెచ్చుకోవాలి. పైగా రాహుల్ రవింద్రన్ లాస్ట్ సినిమా మన్మధుడు-2 అట్టర్ డిజాస్టర్. అయితే కంటెంట్ ఏ రేంజ్లో ఉందో మనకు తెలియదు. కాకపోతే చిలసౌ వంటి సినిమాలోనే అమ్మాయి పాత్రకు అంత హై ఇచ్చినప్పుడు.. ఇప్పుడేకంగా లేడి ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఎంతో కొంత మంచి కంటెంట్‌తోనే వస్తాడన్న ధీమా అయితే సినీ లవర్స్‌లో ఉంది. గీతాఆర్ట్స్, మాస్ మేకర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఖుషీ ఫేమ్ అబ్దుల్ హేషమ్ వాహద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
The world is full of great love stories❤️
But there are those few love stories that haven’t been heard or seen before ❤️🩹
And ‘The Girlfriend’ is one such. ❤️🔥#RM24@GeethaArts Production No.51 is #TheGirlfriend 🫰
– https://t.co/mWWGTgRD9G👱♀ – @iamRashmika
✍️ & 🎬 -… pic.twitter.com/3pl9vs3ffP— Rashmika Mandanna (@iamRashmika) October 22, 2023