Rashmika | నేషనల్ క్రష్ రష్మిక తన కెరీర్లో దూసుకుపోతుంది. పుష్ప 2, ఛావా, సికందర్ సినిమాల్లో తన ప్రతిభను చాటిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కుబేరాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమైంది. ఈ రోజు రష్మిక తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు “మైసా” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా విడుదలైన పోస్టర్లో రష్మిక చాలా వైల్డ్‌గా కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే రష్మిక పోషిస్తున్న పాత్ర పూర్తి భిన్నంగా ఉండబోతుందని అర్ధమవుతుంది. టైటిల్ పోస్టర్లో ఆమె శక్తివంతమైన వారియర్ రూపంలో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో ఆమె పాత్ర గురించి నిర్మాతలు ఇచ్చిన హింట్ మరింత క్యూరియాసిటీ పెంచింది. ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి అని చెప్పుకురాగా ఈ చిత్రంలో రష్మిక యోధురాలిగా కనిపించనుందని తెలుస్తుంది. ఒక యాక్షన్ డ్రామాగా మూవీని రూపొందిస్తున్నట్టు సమాచారం.. రష్మిక ఇప్పటివరకు కనిపించిన పాత్రల కంటే పూర్తిగా భిన్నమైన షేడ్‌లో ఇందులో కనిపించనుందని అర్థమవుతోంది.
ఎమోషన్, పవర్, యాక్షన్ మేళవించిన పాత్రను రష్మిక పోషించబోతున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ ద్వారా స్పష్టం అవుతుంది.ముక్కు పుడక, ట్రెడిషనల్ శారీతో పాటు రక్తంతో కూడిన ముఖం ఆమె పవర్ ఫుల్‌గా కనిపించారు ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి రష్మిక స్పందిస్తూ… ‘‘నేను ఎప్పుడూ కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటాను. అందుకే అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తాను. ‘మైసా’ అలాంటి చిత్రమే. ఇది నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర,ఇది నా కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే అని తెలియజేసింది.