అగ్ర కథానాయిక రష్మిక మందన్న దక్షిణాదితో పాటు హిందీలో సైతం తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నది. గత ఏడాది ‘ఛావా’ చిత్రంతో బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆమె హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘తమా’ చిత్రంలో నటిస్తున్నది. తాజాగా ఈ భామ ‘కాక్టెయిల్-2’ చిత్రంలో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 2012లో వచ్చిన ‘కాక్టెయిల్’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.
సైఫ్అలీఖాన్, దీపికా పడుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులు. ప్రేమ, స్నేహం, అనుబంధాల తాలూకు సంక్లిష్టతల నేపథ్యంలో చక్కటి వినోదంతో ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతున్నది. ఇందులో షాహిద్‌కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. అయితే వాటిని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రష్మిక మందన్న ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆన్‌లొకేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అపరిమితమైన వినోదానికి సిద్ధం అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్‌ను జోడించింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.