అగ్ర కథానాయిక రష్మిక మందన్న ‘సీతారామం’ చిత్రంలో కశ్మీర్ ముస్లిమ్ యువతి అఫ్రీన్గా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యుద్ధం నేపథ్య ప్రేమకథ ఇది. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. ముస్లిమ్ సంప్రదాయ వస్త్రధారణలో ఆమె పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపిస్తున్నది. ‘కథాగమనంలో రష్మిక మందన్న పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమికులకు వారధిలా ఆమె ఎలాంటి పోరాటం చేసిందన్నది ఆసక్తినిరేకెత్తిస్తుంది. 1965 బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని చిత్రబృందం పేర్కొంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.