Rashmika Mandana | ‘పుష్ప’ (Pushpa) చిత్రంలోని శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandana). ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా రష్మిక తన మేకప్ అసిస్టెంట్ (Rashmika Makeup Assistant) పెళ్లికి హాజరై సందడి చేసింది. తాజాగా తన మేకప్ అసిస్టెంట్ పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. ఈ పెళ్లికి హాజరైన రష్మిక చీరలో వచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా.. ఈ పెళ్లిలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లి అనంతరం నూతన వధూవరులకు రష్మిక శుభాకాంక్షలు చెబుతుండగా.. ఆ జంట రష్మిక కాళ్లు మొక్కారు. దీంతో షాక్ అయిన రష్మిక అనంతరం వారిద్దరిని ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“📸 Actress #RashmikaMandanna graced her assistant’s wedding in Hyderabad today, spreading love and blessings ❤️🥺. Witnessed a heartwarming moment as the newlyweds sought her blessings. #WeddingBliss #HyderabadDiaries #BlessingsFromRashmika” pic.twitter.com/lsU61K4h8s
— “Movie Keeda Diaries : Cinematic Obsession” (@altamash4u) September 3, 2023
ఇదిలా ఉండగా.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’తో పాటు.. రణ్‌బీర్ కపూర్ హీరోగా రానున్న ‘యానిమల్’ (Animal) సినిమాలో నటిస్తుంది.