కన్నడ కస్తూరి రష్మిక షార్ట్ టైంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన విషయం తెలిసిందే. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందంతో మరో హిట్‌ను తన కిట్టీలో వేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు యంగ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. అప్పటి వరకు కుర్ర హీరోల సరసన నటించిన రష్మిక ఇప్పుడు స్టార్ హీరోలతో నటించడం మొదలు పెట్టింది.
అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరులో రష్మిక కథానాయికగా నటించగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.
రష్మిక ఈ మధ్య బాలీవుడ్లో కూడ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతో పాటు గుడ్ బై అనే సినిమాలో నటిస్తుంది. క్వీన్,సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ ప్రస్తుతం అమితాబ్ – రష్మికలతో గుడ్ బై సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొదటి రోజు అమితాబ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను ఇటీవల రష్మిక తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆనందించింది. తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.
తెలుగు,తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తుండడంతో పాటు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు షేర్ చేస్తూ అశేష అభిమానాన్ని పొందింది. ప్రస్తుతం రష్మిక ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్స్‌కి చేరింది. సమంత, పూజా హెగ్డే, తమన్నాలను దాటి ఈ అమ్మడు 20 మిలియన్స్ మార్క్ చేరుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.