రష్మిక మందన్నా..తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదుంది కన్నడ భామ రష్మిక మందన్నా. ఈ భామ ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రష్మిక రెడ్ శారీలో పూలబుట్ట ఒడిలో పెట్టుకుని గ్రీనరీలో కూర్చున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆడాళ్లు మీకు జోహార్లు ప్రస్తుతం ప్రీ పొడ్రక్షన్ పనుల్లో ఉంది.
ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ తో సాగే ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ఎల్వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 2021 సెకండాఫ్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మరోవైపు అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తోంది. శ్రీకారం సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్.
Team #AadavaalluMeekuJohaarlu wishes the most talented & cutest actress @iamRashmika a very Happy Birthday #HBDRashmikaMandanna@ImSharwanand @DirKishoreOffl @SLVCinemasOffl pic.twitter.com/fG4ozKjQe8
— BA Raju's Team (@baraju_SuperHit) April 5, 2021