ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో చాలా పద్దతిగా కనిపించేది. కాని ఎప్పుడైతే బాలీవుడ్ ఆఫర్స్ తలుపు తట్టాయో బట్టలు సైజ్ కూడా తగ్గించింది. క్యూట్ అందాలతో కేక పెట్టిస్తూ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టీ షర్ట్, షార్ట్ హాట్ ప్యాంట్‌తో పుష్ప మూవీలోని సామీ సామీ హిందీ సాంగ్‌కు స్టెప్స్ వేసింది.
చాలా మంది ఈ సామీ సామీ పాటకు రీల్స్ చేయడం నేను చూస్తూనే ఉన్నాను..అందుకే మీతో పాటు నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకున్నా. అందుకే ఈ వీడియో చేశాను.. ఇలా చాలా మంది వారి స్టెప్స్‌తో.. మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను అంటూ రష్మిక మందన్నా తన డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు నెట్టింట వైరల్‌గా మారింది.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లోను వేదికపై రష్మిక తన క్యూట్ డ్యాన్స్‌తో మతులు పోగొట్టింది. ‘సామి సామి..’ సాంగ్ లో డ్యాన్స్ కోసం రష్మిక బాగా కష్టపడిందట. అల్లు అర్జున్ డ్యాన్స్ స్టైల్ ని మ్యాచ్ చేయాలి అంటే ఎక్కువ కష్టపడాలి కదా. అందుకే రష్మిక మందన్న ఏకంగా 18 గంటలు పాటు రిహార్సల్ చేసిందట. ఈ ఒక్క పాటకే చాలా సేపు రిహార్సిల్ చేసి షూట్ లో బాగా చేసిందని సినిమా బృందం ముచ్చటించుకున్నారు. అందం, అభినయంతో అలరిస్తున్న రష్మిక మందన్నా తక్కువకాలంలోనే దక్షిణాదిలో అగ్రస్థానానికి చేరుకుంది.
https://www.instagram.com/reel/CXc4EzMJb0X/?utm_source=ig_web_copy_link