Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Rashmi | తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు, మూగజీవాలకు కూడా రక్షణ లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Rashmi | తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు, మూగజీవాలకు కూడా రక్షణ లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి మోజెస్ అరేలియా హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మిల్టన్ ఫెర్నాండెజ్, డేజీ ఇవాంజెలియా దంపతులకు మోజెస్ అరేలియా అనే కుమార్తె, జేడెన్ ఫెర్నాండెజ్ అనే కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం కౌకూరులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది.
అదే ప్రాంతంలో గతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన విక్రమ్ అనే వ్యక్తి చిన్నారిని అపహరించి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించడంతో అతడికి నిర్వాహకులతో వివాదం ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్నారి అదృశ్యం కావడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఫోన్ కాల్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి, గేటెడ్ కమ్యూనిటీలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. చివరకు అక్కడి నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
చిన్నారి హత్య ఘటనపై స్పందించిన రష్మి గౌతమ్.. డబ్బు కోసం ఐదేళ్ల పాపను అపహరించి హత్య చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేకపోయానని పేర్కొన్నారు. మనుషులకు ఏమైందని, సమాజం ఎటు వెళ్తోందని ప్రశ్నించారు. చిన్నారులు, మూగజీవాలకు రక్షణ లేని ప్రపంచం ఉండకూడదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. బలహీనులను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా అని ప్రశ్నించారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో సామాజిక మాధ్యమాలను తెరవాలన్నా భయంగా, బాధగా అనిపిస్తోందనే భావనను తన పోస్ట్‌లో పంచుకున్నారు. ఈ దారుణ ఘటనపై పలువురు నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రష్మి పోస్ట్ కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన ఆస్ట్రేలియా స్టార్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

