Rashmi Gautam | యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్‌గా కన్నా కూడా సమాజంపై ఎక్కువగా బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. రష్మీకి సమాజంపై గౌరవం, మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. మూగజీవాల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఈ మధ్య ఆపరేషన్ సిందూర్ గురించి తరచు ప్రస్తావిస్తుంది. కొద్ది రోజుల క్రితం రష్మీ తన సోషల్ మీడియా పేజ్‌లో భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తూ.. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొంది.
పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండనక్కర్లేదని, భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ రాసుకొచ్చింది. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి , దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండంటూ రష్మీ తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం అంటూ రష్మీ తన పోస్ట్‌లో పేర్కొంది. సెన్సిటివ్ విషయాల గురించి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానిని మనం అర్ధం చేసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించకుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ రష్మీ పేర్కొంది.
ఇక ఇటీవల రష్మీ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ తనకి సర్జరీ జరిగిందని చెప్పుకొచ్చింది. అలానే నా హిమోగ్లోబిన్ లెవల్ ఐదు రోజుల్లో 9కి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి నాకు బ్లీడింగ్ కూడా ఎక్కువైంది. అలానే భుజం నొప్పి కూడా దీనికి తోడైంది. మార్చి 29 నుంచి అయితే నా పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ తన బాధలని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచింది. అయితే ఈ సారి తన బర్త్ డేని బాలీలో జరుపుకుంది. వీల్ చైర్లో కూర్చొనే అందమైన ప్రదేశాలని చూస్తూ ఎంజాయ్ చేసింది రష్మి.