Rashmi Gautam | బుల్లితెరపై సందడి చేస్తున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ భామ ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తూ ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్ ద్వారా అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఇక ఆమెకు జంతువులపై ఉండే ప్రేమ అందరికీ తెలిసిందే. ఎంతోమంది ఆమెను జంతు ప్రేమికురాలిగా అభినందిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్మి ఊహించని నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా అకౌంట్స్‌కి నెల రోజులపాటు బ్రేక్ ఇవ్వనుందని ప్రకటించింది. దీనిని ఆమె డిజిటల్ డీటాక్స్గా పేర్కొంది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ భావోద్వేగపూరితమైన మెసేజ్‌ను పంచుకుంది.
“ఇప్పటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా. కొన్ని విషయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. ఇది మన ఆలోచనలపై, మనస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అందుకే నెలరోజుల పాటు పూర్తి విరామం తీసుకుంటున్నా.. నేను మరింత బలంగా తిరిగి వస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా,” అంటూ రష్మి పేర్కొంది. ఆమె చెప్పిన విషయాలు అభిమానులను ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి. నువ్వు బలంగా తిరిగి రావాలి , “నిన్ను మిస్ అవుతాం అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ డీటాక్స్ అనేది సామాజిక మాధ్యమాల ప్రభావం నుండి కొంతకాలం దూరంగా ఉండే ప్రక్రియ. రోజువారీ జీవితంలో ఫోన్లు, సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రష్మి గౌతమ్ అదే దిశగా ఒక అడుగు వేసింది. ఆమె ఈ సమయంలో పూర్తిగా వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ గ్యాప్ తర్వాత మరింత శక్తివంతంగా తిరిగి రావాలని ఆమె కోరుకుంటోంది.