అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత,కాజల్,నిహారిక వంటి కథానాయికలు పెళ్లైనప్పటికీ సినిమాలలో రాణిస్తూనే ఉన్నారు. మరి కొందరు ముద్దుగుమ్మలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా తనకు ఎలాంటి వరుడు కావాలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగు,తమిళ సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన రాశీ ఖన్నా..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని, తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని అంటోంది రాశీ ఖన్నా. అలాంటి వ్యక్తిని వెతికి పెళ్లి చేసుకుంటానంటుంది రాశీ.
వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచిన రాశీఖన్నా ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో బిజీగా ఉంది. తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో రాశీఖన్నా నటిస్తోంది. వీటితో తన పాత ఫాంని మళ్లీ అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.