Rasha Thadani | ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం హీరో ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.
ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. ఈ సందర్భంగా టీం ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ రషాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కొద్ది రోజులుగా ఆమె నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుండగా, సోమవారం విడుదలైన పోస్టర్‌తో దీనికి అధికారిక క్లారిటీ వచ్చింది. ‘AB4’ పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. బాలీవుడ్లో రషా అరంగేట్రం చేసియగా, అప్పుడు ‘ఆజాద్’ సినిమాలో ఒకే ఒక్క స్పెషల్ సాంగ్‌తోనే ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్మెంట్లు, స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే జోష్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
జయకృష్ణ ఘట్టమనేనిని న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. తిరుపతి – చిత్తూరు నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసింది. ఈ చిత్రం తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘రాజకుమారుడు’తో మహేష్ బాబును హీరోగా పరిచయం చేసిన అశ్వినీదత్, ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోను కూడా పరిచయం చేయడం విశేషం. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి “శ్రీనివాస మంగాపురం” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి.