రావురమేశ్ హీరోగా నటించిన చిత్రం ‘మారుతీనగర్ సుబ్రహణ్యం’. ఇంద్రజ కథానాయిక. లక్ష్మణ్కార్య దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఆగస్ట్ 23న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలంగాణ, ఏపీల్లో విడుదల చేస్తున్నది. ఈ చిత్రం ట్రైలర్‌ని ఆదివారం హీరో రామ్‌చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. వినోదభరిత కుటుంబకథాచిత్రంగా ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ చెబుతున్నది. రావురమేశ్, ఇంద్రజ ట్రైలర్లో భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ఇందులో రావురమేశ్ గెటప్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ అన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా నటించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర పాత్రధారులు. ఈచిత్రానికి కెమెరా: ఎంఎన్ బాల్‌రెడ్డి, నిర్మాణం: పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్.