Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) 2014లో తీవ్ర మానసిక వేదనకు గురైన సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి పంచుకుంటూనే వుంటుంది దీపికా. దాన్నుంచి ఎలా బయటపడాలో వివరిస్తుంటుందీ. తాజాగా దీపికా భర్త రణ్వీర్ సింగ్ (Ranveersingh) ఈ అంశం గురించి కాఫీ విత్ కరణ్ షో లో స్పందించాడు.
‘దీపిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. తన మనసు ఆలోచనలు ఎక్కడో ఉండేవి. చాలాసార్లు ఏడ్చేది. నేను నిస్సహాయంగా ఉండేవాడిని. ఏం చేయాలో అర్ధంకాక ఆమె కుటుంబానికి కబురుపెట్టాను. డిప్రెషన్ (Depression) చాలా భయంకరమైనది. దానిపై అవగాహన, కౌన్సెలింగ్ చాలా అవసరం. డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చెప్పుకొచ్చారు రణ్వీర్ సింగ్.
కాగా డిప్రషన్ నుంచి కోలుకున్న దీపిక ప్రస్తుతం అలాంటి సమస్యలతో బాధపడే వారికి అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే 2015లో ‘ది లివ్ లవ్ లాఫ్’ అనే ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆందోళనలు, ఒత్తిళ్లతో సతమతమయ్యే ఎంతోమందికి ఈ వేదికగా ప్రముఖ నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది.