Ranveer Singh Dance |బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గణేష్ చతుర్థి వేడుకల్లో తన ఎనర్జీటిక్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నివాసం ‘ఆంటిలియా’లో ప్రతియేటా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన వేడుకలకు తన భార్య దీపికా పదుకొణెతో కలిసి రణవీర్ హాజరయ్యారు. గణపతిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించింది ఈ జంట. అయితే ఈ వేడుకలలో అగ్నిఫథ్ సినిమాలోని ‘దేవా శ్రీ గణేషా’ పాటకు రణవీర్ డ్యాన్స్ చేశాడు. తన హై-ఎనర్జీ డ్యాన్స్‌తో ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వేడుకకు రణవీర్, దీపికా సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. దీపికా బంగారు రంగు అనార్కలీ దుస్తుల్లో మెరిసిపోగా, రణవీర్ పసుపు రంగు కుర్తా సెట్‌ను ధరించి క్లీన్-షేవ్ లుక్‌లో ఆకట్టుకున్నారు.