Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లను రాబట్టగా.. ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి లడఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం పన్ను మినహాయింపును (Tax-Free) ప్రకటించింది.లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం లడఖ్‌లోని లొకేషన్లలో జరగడం వల్ల, అక్కడ పర్యాటక రంగం (Tourism) మరింత పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే లడఖ్‌ను అంతర్జాతీయ సినిమా షూటింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ వెసులుబాటు కల్పించారు. చిత్రంలోని బలమైన దేశభక్తి ఇతివృత్తం కూడా ఈ పన్ను మినహాయింపుకు ప్రధాన కారణంగా నిలిచింది.
‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మైలురాయిని దాటి 2025లో అతిపెద్ద హిట్‌గా అవతరించింది. రణ్వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ మరియు అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఈ స్పై థ్రిల్లర్‌లో నటించారు. భారతీయ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఎలా ఛేదించారనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.