Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఒక వృద్ధ అభిమాని పట్ల ఆయన చూపించిన ప్రేమ, గౌరవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలోని ఒక డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి బయటికి వచ్చిన రణ్వీర్ సింగ్‌ని చూడడానికి అభిమానులు ఒక్కసారిగా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఒక వృద్ధ మహిళా అభిమాని కూడా తన చేతిని ముందుకు చాచి పలకరించాలని చూసింది. ఇది గమనించిన రణ్వీర్, వెంటనే ఆమె వద్దకు వెళ్లి నమస్కరించి, ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, ఆమె పాదాలను తాకి, ఆమె చేతిని ముద్దు పెట్టుకుని తన గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్ ప్రస్తుతం ‘ధురంధర్’ (Dhurandhar) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.