Rangeela Re Release | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఒకటైన ‘రంగీలా’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా విడుదలై సెప్టెంబర్ 08 నాటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘అల్ట్రా మీడియా’ ఈ సినిమాను త్వరలోనే 4కే వెర్షన్లో రీ రిలీజ్ చేయబోతుందని వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
‘రంగీలా’ సినిమా 1995లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఊర్మిళ మాతోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ఏ.ఆర్. రెహమాన్ బాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి ఆయన అందించిన పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు, కానీ అక్టోబరులో రీ-రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
RANGEELA Re Releasing in 4 K DOLBY … CONGRATS #AamirKhan @UrmilaMatondkar @bindasbhidu @arrahman The COLOURS are COMING BACK 💐💐💐💃🏼💃🏼💃🏼 pic.twitter.com/rswDQCHs81
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2025