Rangamarthanda Movie On OTT | కొన్ని సినిమాలను రికార్డులు, కలెక్షన్లు గట్రా వంటి వాటితో పోల్చలేము. మనుసుకు హత్తుకునేలా, థియేటర్లలో నుంచి బరువైన గుండెలతో బయటకు వచ్చేలా ఎమోషన్‌లా కనెక్ట్ అవుతుంటాయి. కొనుకున్న టిక్కెట్‌కు వంద శాతం న్యాయం చేస్తుంటాయి. అవే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమానే రంగమార్తాండ. దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకుని కృష్ణ వంశీ ఈ సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్లతోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశారు. ఇక విడుదలకు ముందే ఏకంగా ప్రీమియర్లు వేసి మరీ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో మేకర్స్ స్పష్టం చేశారు.
మైత్రీ మేకర్స్ వంటి బ్యానర్ ఈ సినిమాను విడుదల చేస్తుందంటే అందరిలోనూ నమ్మకం. అదే నమ్మకాన్ని నిజం చేస్తూ గతనెల 22ను రిలీజైన ఈ సినిమా పాజిటీవ్ రివ్యూలు సొంతం చేసుకుంది. కృష్ణవంశీ నుంచి ఇలాంటి సినిమా వచ్చి ఎంతకాలమైందని పలువురు వెల్లడించారు. ప్రకాష్ రాజ్ నటన వర్ణనాతీతం అని, బ్రహ్మనందం క్యారెక్టర్ గొప్పగా ఉందని.. ఇలా ఎక్కడ చూసిన పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. కలెక్షన్ల సంగతి అటుంచితే సినిమాకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురు చూశారు.
కాగా గుట్టు చప్పుడు చేయకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో గత అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా డిజిటల్లోకి ప్రత్యక్షమైంది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లీగంజ్ కీలకపాత్రలను పోషించారు. మారాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.