నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా కథానాయిక. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలోని ‘కల కంటూ ఉంటే..’ అనే రెండో గీతాన్ని గురువారం విడుదల చేశారు.
నాయకానాయికల మధ్య ప్రేమబంధాన్ని ఆవిష్కరించే చక్కటి మెలోడీ గీతమిదని స్వరకర్త సి.హెచ్. పవన్ తెలిపారు. కృష్ణకాంత్ రచించిన ఈ గీతాన్ని కల్యాణి, వైష్ ఆలపించారు. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: పవన్ సి.హెచ్, రచన-దర్శకత్వం: సుధాకర్ చెరుకూరి.