Naga Shaurya | బడ్జెట్ బౌండరీలు దాటినా సరే కంటెంట్ లేకపోతే అది బూడిదపాలే. ప్రస్తుతం అన్ని సినిమా రంగాల్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. కంటెంట్‌తో వస్తే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్లో హిట్లు కొడుతున్నాయి. ఇక కంటెంట్ ఎంత ముఖ్యమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. సినిమాపై హైప్ లేకపోతే ఎంతటి స్టార్ సినిమా అయినా తొలిరోజు బొక్క బోర్లా పడాల్సిందే. ఈ వారం విడుదలయ్యే సినిమాలన్నిటిలో కాస్త ఎక్కువ బజ్‌తో రిలీజవుతున్న సినిమా రంగబలి. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
కావల్సినంత ఎంటర్టైనమెంట్తో పాటు యూత్‌తో పాటు మాస్ బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందని ట్రైలర్‌తో స్పష్టమయింది. నాగశౌర్య కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఇటివలే ఓ ప్రెస్ మీట్లోనూ చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లు సైతం తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటివలే కమెడియన్ సత్య పలువురు మీడియా సెలబ్రిటీలను ఇమిటేట్ చేస్తూ పాల్గొన్న మిమిక్రి ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో శనివారమే విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మీడియా సెలబ్రెటీలలో ఇద్దరూ దీన్ని అడ్డుకున్నారని వినికిడి. అది మాత్రం రిలీజైతే ఈ సినిమాపై మరింత బజ్ పెరిగే అవకాశం ఉంది.
పవన్ బసమ్శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరిజా నటిస్తుంది. సత్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. దసరా తర్వాత ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తున్న సినిమా కావడంతో దాని తాలుకూ క్రేజ్ కూడా కాస్త ఉంది. ఈ సినిమాకు పవన్ సీహెచ్ స్వరాలు అందించాడు.