మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘SSMB 29’పై ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమాలోని సెకండ్ హాఫ్‌లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ కోసం ఓ స్పెషల్ రోల్‌ను రాజమౌళి డిజైన్ చేశారట.
ఆ రోల్లో బాలీవుడ్ టాప్ హీరో రణబీర్‌కపూర్ కనిపిస్తారనేది ఈ వార్త సారాంశం. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులే కాక, హాలీవుడ్ నటులు కూడా భాగం అవుతుండటం విశేషం.