Shah Rukh Khan – Ranbir Kapoor | బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాళ్లు మొక్కాడు నటుడు రణ్‌బీర్ కపూర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎంగా ఫడ్నవీస్‌తోపాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, రాందాస్ అథవాలే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
వీరితో పాటు వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్-అంజలి దంపతులు, బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రణ్‌బీర్ కపూర్ షారుఖ్ ఖాన్ వద్దకి వెళ్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. దీంతో లేచిన షారుఖ్ అతడిని హగ్ చేసుకుంటాడు. పక్కనే రణ్వీర్ సింగ్ కూడా వచ్చి షారుఖ్‌కు హగ్ ఇస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Ranbir Kapoor so humble ❤️#RanbirKapoor #ShahRukhKhan
— VarunRK 💫 (@Varun_RK88) December 5, 2024