Shamshera Movie | అప్పుడే ఓటీటీలోకి రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shamshera Movie On OTT | బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘షంషేరా’. ‘సంజు’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు రణ్‌బీర్ వెండితెరపై కనిపించాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ శుక్రవారం విడుదలై నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా రణ్‌బీర్ కెరీర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చాయి. పోస్ట్ పాండమిక్ తర్వాత బాలీవుడ్లో అత్యధిక థియేటర్లలో విడులైన సినిమాగా ‘షంషేరా’ నిలిచింది. కానీ కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం దారుణంగా ఫేయిలైంది. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రెండు రోజుల్లో 10కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో షోలను రద్దు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడులకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఆగస్టు రెండవ వారం నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా నటించాడు. వాణి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం రణ్‌బీర్ ఆశలన్నీ ‘బ్రహ్మస్త్ర’ పైనే ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించాడు.
Read Also:
Vijay Antony | విజయ్ అంటోని ‘దోషి’ ఫస్ట్‌లుక్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్
Bimbisara Movie | ట్రెండింగ్‌లో ‘బింబిసార’ సెకండ్ సింగిల్
Viruman Movie | షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలో.. సందడి చేయనున్న కార్తి మూవీ
Liger Movie | భారీ ధరకు ‘లైగర్’ శాటిలైట్-డిజిటల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

